బదిలీపై వెళ్తున్న అధికారికి ఘన సన్మానం.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల పరిధిలోని కోత్తపల్లి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) గౌస్ బదిలీపై రాంపూర్ వెళ్లడంతో కోటగిరి రైతు వేదిక కార్యాలయంలో జిల్లా   సేవాలాల్ సేన  కమిటీ అధ్యక్షులు సీతారాం నాయక్ ఆధ్వర్యంలో దేవునిగుట్ట  రైతులు ఘనంగా సన్మానించారు. సీతారాం నాయక్ మాట్లాడుతూ.. ఆయన సేవలు మరువలేమని కొనియాడారు. ఆయన రైతులకు  చేసిన  మేలు మర్చిపోలేమని గుర్తు చేశారు. రైతుబంధు, రైతు బీమా రైతులకు అందించడంలో ఆయన వంతు కృషి చేశారని కొనియాడారు. ఆయనకు ఎల్లవేళలా మర్చిపోలేమని  అన్నారు. ఆయన ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రవి నాయక్, కోటగిరి మండల అధ్యక్షుడు తారా సింగ్, ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్, రవి నాయక్, రమేష్, మాజి ఉప సర్పంచ్ లక్ష్మణ్ ,జై రామ్ నాయక్, వడిత్య రామ్ కిషన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

.