తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండలంలోని దోమలేడ్గి వయా కొల్లూరు గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి నిర్మాణం వద్ద తాత్కాలిక డైవర్షన్ రోడ్డు పై నుండి నీటి ప్రవాహం పారుతున్నందున రెండు ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి రెండు గ్రామాల ప్రజల రాకపోకలను నిలిపివేయడం జరిగిందని తహసీల్దార్ మల్లయ్య తెలిపారు. రెండు గ్రామాల ప్రజలు అత్యవసర పని ఉన్నచో వేరే దారిగుండా వెళ్లాలని సూచించారు.
