మహతి కళాశాలలో బతుకమ్మ సంబరాలు

తెలంగాణ ప్రభ, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ సంస్కృతి ప్రతీక అయినా బతుకమ్మ వేడుకలను స్థానిక మహతి మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం వైభవంగా నిర్వహించారు. తీరొక్క రంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో ఆరాధించారు పండుగకి కొత్త శోభన తీసుకొచ్చారు. పువ్వులకి పూజ చేసే అరుదైన వేడుకగా బతుకమ్మ ఖండాంతర ఖ్యాతిని సంపాదించిందని కళాశాల ప్రిన్సిపాల్  గెంట్యాల భూమేష్ ఈ సందర్భంగా అన్నారు. వేడుకలలో కళాశాల అధ్యాపకులు దామెర స్వామి, రమేష్ కుమార్, వైష్ణవి, చిటికెన వేణుగోపాల్, శ్రీనివాస్, చంద్రశేఖర్, విద్యార్థులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.



.