రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా పాకాల శంకర్ గౌడ్.

తెలంగాణ ప్రభ, సిరిసిల్ల: కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్లలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న పాకాల శంకర్ గౌడ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కాపేట్ గ్రామంలో సాధారణ గీత కుటుంబంలో జన్మించిన శంకర్ గౌడ్ సెకండ్ గ్రేఢ్ టీచర్ గా 1999లో ఇల్లంతకుంట రహీంఖాన్పేట్ లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. విభిన్న రంగాల్లో రాణిస్తూ ఎక్కడ పని చేసిన విద్యార్థులను ఉన్నతంగా తీర్చి దిద్దేవారు. విద్యార్థుల్లో సృజనాత్మకతాను వెలికితీసు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. శంకర్ గౌడ్ నేతృత్వంలో అనేకమంది విద్యార్థులు విస్తృతంగా ప్రయోగాలు చేసి ప్రశంసలు అందుకున్నారు. నేడు హైదరాబాదులో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకర్ గౌడ్ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు అందుకోనున్నారు. శంకర్ గౌడ్ అవార్డు కు ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

.