తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండల కేంద్రంలోని షాదీఖానా కార్యాలయంలో లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుడు గంధపు రాజు సహకారంతో పొతంగల్ మండల కేంద్రంలోని ప్రజలకు చుట్టుపక్క గ్రామాల ప్రజలకు ఆక్కు ప్రెషర్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరం ముగింపు కార్యక్రమంలో భాగంగా వైద్యులకు గంధపురాజు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండల కేంద్రంలోని శిబిరాన్ని నిర్వహించడంతో గ్రామస్తులకు ప్రజలకు పలు వ్యాధుల నుండి విముక్తి కలిగిందని అన్నారు. గ్రామస్తులకు పలు వ్యాధులు నయం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మరల అవసరమున్నచో వైద్య శిబిరాన్ని గ్రామస్తుల మేరకు ఏర్పాటు చేసి వాళ్ళ పలు రకాల వ్యాధులకు న్యాయం చేయటానికి సహకరిస్తానని పాత్రికేయులతో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ ఫుల్ కంటి సాయిలు కాంగ్రెస్ నాయకులు ధనరాజ్ తజముల్, మహమూద్, మన్సూర్,ఖలేక్,అజ్దాని దేశాయి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
