తెలంగాణ రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే తప్ప బయటకు వెళ్ళొద్దని ఆమె అన్నారు గ్రామాలలో తడిసిన కరెంటు స్తంభాలకు అదేవిధంగా చెరువుకుంటలకు దూరంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని మన తెలిపారు పంట పొలాల్లో రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్త పాటించాలని అన్నారు గాలి దుమారం వర్షం వలన పెరిగిన విద్యుత్ వైర్లను ముట్టుకో రాదని డ్రైనేజీ ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని ఆమె కోరారు

.