తెలంగాణ ప్రభ (కోటగిరి): బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి స్వగృహంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ప్రమాద శాత్తూ మరణించిన వారికి ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చికిత్స చేసుకున్న వారికి సీఎం సహాయనిధి కింద దరఖాస్తు చేసుకోవడంతో చెక్కులు మంజూరు కావడం జరిగిందన్నారు. వారు పోతంగల్ లబ్ధిదారులు చంద్రకళ, సుమలత, అస్గరి బేగం(3 ), హంగర్గ ఫారం లబ్ధిదారులు కరిష్మా ,దిలీప్ కుమార్ (2) , కోటగిరి మండలం రాంపూర్( 1 ), వారి కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేశారు. వీరందరికి కలిపి మొత్తం 2లక్షల 81 వేల రూపాయలు చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్ తెలిపారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... సీఎంకు,శాసన సభ్యులకు,రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కు చెక్కులు పొందిన లబ్ధిదారుల కుటుంబ సభ్యులు కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి శంకర్ పటేల్ పోతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్, మాజీ సర్పంచ్ ఏజాజ్ ఖాన్, మాణిక్యప్ప, ప్రకాష్,ఎమ్మార్పీఎస్ నాయకుడు నాగేశం ,మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
