తెలంగాణ ప్రభ (నర్సాపూర్): క్రీడల పోటీలో పాల్గొనడం వల్ల స్నేహ భావం పెరుగుతుందని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. హత్నూర మండలంలోని దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రీడా ఉత్సవాలను శుక్రవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు దేహాదారుధ్యానికి దోహదం చేస్తాయన్నారు అంతేకాకుండా ప్రతి క్రీడాకారులకు క్రీడల స్ఫూర్తితో ఆడి గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. ఓటమి గెలుపు నాకు నాంది పలుకుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొద్దిసేపు క్రీడాకారులతో ఆడి ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో. మాజీ ఎంపీపీ వావిలాల నరసింహులు. సీనియర్ నాయకులు. ఉమ్మన్న గారి దేవేందర్ రెడ్డి. సత్యం గౌడ్. మాజీ సర్పంచ్ వెంకటేశం. బి వి శివ శంకర్ రావు. మాజీ ఎంపీటీసీ.ఇంద్ర సతీష్. మాయిని శ్రీకాంత్. మాయిని వీరేందర్. అజ్మత్ అలీ (అజ్జు) రఫీషా. ఇబ్రహీం. సురేష్ గౌడ్. నరసింహారెడ్డి. రామచంద్ర రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.
.