ఉచిత హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన కొలుకుల జైహింద్

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని పొలాల బస్తిలో ప్రభుత్వ ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన హెల్త్ క్యాంపును  యువజన నాయకుల కొలుకుల జైహింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్లు నిర్వహించిన పరీక్షల్లో ఓ వ్యక్తికి డెంగ్యూ వ్యాధి సోకినట్లు గుర్తించారు. అనంతరం జైహింద్ మాట్లాడుతూ వర్షాకాల సమయంలో పలు అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా దోమల నివారణ కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కతమ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన డాక్టర్ల కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్, సిస్టర్ లలిత, ఆశా వర్కర్లు కళ్యాణి, మౌనిక ,శ్రీలత, గాయత్రి, రత్నమ్మ ,స్థానిక నాయకులు

.