తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి ఉమ్మడి మండలంలోని పోతాంగల్ మండలంలోని పలు గ్రామాలలో ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా బిఎల్వోలు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటి సర్వే చేపట్టడం జరుగుతుందని పోతంగల్ తహసిల్దార్ మల్లయ్య తెలిపారు. ఓటర్ లిస్ట్ లోని చనిపోయిన వారి పేర్లను తొలగించి, 18 సంవత్సరాలు నిండిన యువతి యువకుల పేర్లు నమోదు చేయాలని బిఎల్ఓలకు అంగన్వాడీ టీచర్లకు ఆదేశించారు. గ్రామం నుంచి వెళ్లిపోయిన వారి పేర్లు వివాహమైన వారి పేర్లు ఓటర్ జాబితా నుండి తొలగించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని గ్రామస్తులకు తెలిపారు. ఓటర్ లిస్టులోని ఇంటిపేరు ఫోటో తప్పు ఉన్నచో సరిచేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో పొతంగల్ ఆర్ఐ. సాయిలు, బిఎల్వోలు అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
