గుమ్మడి అనాధ ఆశ్రమంలో సివిల్ జడ్జి మొక్క నాటారు.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల పరిధిలోని ఎక్లాస్ పూర్  క్యాంప్ లో గల   గుమ్మడి అనాధ ఆశ్రమంలో నిజామాబాద్ సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి జిల్లా న్యాయ సేనదికార సంస్థ శ్రీమతి పద్మావతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలోని  విద్యార్థులకు మాట్లాడుతూ వారి ఆరోగ్య పట్ల వివరాలను  తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఆశ్రమ ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో కోటగిరి కరెంట్ ఏఈ నాయిని కృష్ణ ,గుమ్మడి అనాధ ఆశ్రమ నిర్వాకులు నీరడి మధు ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

.