మేలైన వైద్య సేవలు అందించేందుకు అవగాహన

ఎం వసంతరావు ,జిల్లా వైద్యాధికారి.

తెలంగాణ ప్రభ(సిరిసిల్ల) ప్రజలకు మేలైన వైద్య సౌకర్యాలు అందించేందుకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి ఏం వసంతరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్లకు జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధి నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ హెచ్ఐవి మానవులు వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుందని సురక్షితం కానీ లైంగిక సంపర్కం కలుషితమైన రక్తమార్పిడి, సూదులు సిరంజిలు వాడకం వల్ల వ్యాధి వ్యాపిస్తుందని అన్నారు. తీసుకోవలసిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఎస్ రజిత, డాక్టర్ రాజగోపాల్, డాక్టర్ అంజలి అల్ఫ్రెడ్, డాక్టర్ నైమ్ జాన్, డిపిఎం సురేంద్రబాబు, ఉమాదేవి, డిపిఓ సత్యనారాయణ, ఎమ్మెల్ హెచ్పి సిబ్బంది పాల్గొన్నారు.

.