కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీల ఆందోళన.
తెలంగాణ ప్రభ (సిరిసిల్ల) ప్రభుత్వం అంగన్వాడి టీచర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్ అందించాలని వేతనంలో సగం జీతాన్ని పెన్షన్ గా అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమాలు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి, రమణ, గణేష్ అంగన్వాడి టీచర్లు సరోజన, తులసమ్మ, కళావతి, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
