తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల పరిధిలోని కొత్తపల్లి మండల ప్రాథమికోన్నత పాఠశాలను సీనియర్ సివిల్ జడ్జ్ కార్యదర్శి జిల్లా న్యాయ సేనదికార సంస్థ నిజామాబాద్ శ్రీమతి పి. పద్మావతి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెడుతూ, రుచికరమైన భోజనాన్ని అందించాలని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ కు ఆదేశించారు. గతంలో మధ్యాహ్న భోజన కార్మికులు పాఠశాల విద్యార్థులకు కారంతో భోజనం వడ్డిస్తున్నారని ఆరోపణలు రావడంతో పాఠశాలను పరిశీలించడం జరిగిందన్నారు. అన్నంతో పాటు సాంబారు, కూరగాయలా ఫ్రై పెట్టాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జడ్జితో మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లుల ఫండ్స్ పెంచాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని ఆమెకు కోరారు. ఆమె వెంట పాఠశాల ఉపాధ్యాయుడు కిషన్, ఉపాధ్యాయురాలు ఝాన్సీ విద్యార్థులు తదితరులు ఉన్నారు.
