తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల) సీజనల్ వ్యాధులపై హెల్త్ క్యాంపులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని లంబాడి ఐక్యవేదిక భీమ్ ఆర్మీ నాయకులు గురువారం జిల్లా వైద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లంబాడి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నరేష్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని అనేక గ్రామాలలో డెంగ్యూ, విష జ్వరాలు సీజన్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామాలలో హెల్త్ క్యాంపులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు ఇచ్చిన వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, సుమన్, శ్రీధర్, నాగరాజ్, విజయ్, ప్రణయ్ మహేష్ పాల్గొన్నారు.
