గుడుంబా స్థావరాలపై ఆకస్మిక దాడులు.

27 లీటర్ల గుడుంబా లీటర్లు నేలమట్టం.

17 కేసులలో 19 మందిపై కేసులు నమోదు. 

తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల) జిల్లాలో గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గురువారం నిర్వహించిన తనిఖీల్లో 133 లీటర్ల జాగిరిని నీలమట్టం చేయడమే కాకుండా, 27 లీటర్ల గుడుంబా అను స్వాధీనం చేసుకున్నారు. 17 కేసులలో 19 మంది పై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ నిషేధిత నాటు సారా తయారు చేయడం పై మండిపడ్డారు. అటవీ ప్రాంతాలలో చట్టవేదంగా వ్యవహరిస్తున్న వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని అన్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నామని వారిని పట్టుకుని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

.