తెలంగాణ ప్రభ (సిరిసిల్ల) వెంకట్ పేట్ జడ్.పి.హెచ్.ఎస్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్థానిక కౌన్సిలర్ కల్లూరి రాజు చేతుల మీదుగా ట్యాబ్ అందజేశారు. గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సాధించిన అక్షయ అనే విద్యార్థినికి కల్లూరు రాజు ట్యాబ్ అందజేశారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూస రఘుపతి తన తండ్రి స్మారకార్థం పదివేల రూపాయలను ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అందించారు. మదన్ ఎన్నారై గాజుల అక్షయ అనే విద్యార్థినికి 2000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కల్లూరి రాజు మాట్లాడుతూ అత్యుత్తమ ప్రతిమ కనబరిచిన విద్యార్థులకు ట్యాబ్ లు అందిస్తానని అన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూసరగుపతి జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
