తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి లైన్స్ క్లబ్ డైమండ్ ఆధ్వర్యంలో పేద యువకునికి ఉచితంగా మోతిబిందు కంటి ఆపరేషన్ చేయించారు. పోతంగల్ మండలం జల్లాపల్లి పారానికి చెందిన డి. రామ్ చందర్ అనే యువకునికి ఒకే కన్ను పనిచేస్తుంది చిన్ననాటి నుంచి ఒకే కన్నుపై కంటి చూపు ఆధారపడి ఉంది మరో కన్ను పూర్తిగా పనిచేయని పరిస్థితి ఏర్పడింది ఉన్న ఒకే ఒక్క కన్ను కు మోతిబిందు కంటి ఆపరేషన్ తప్పనిసరి అయింది తండ్రి చనిపోవడంతో తల్లి పైనే కుటుంబ భారము ఉండడంతో ఒకే ఒక కన్నుతో పనిచేయని పరిస్థితి ఏర్పడడంతో రామచందర్ కు కంటి ఆపరేషన్ తప్పనిసరి అయింది ఉన్న ఒక్క కన్నును కాపాడుకునేందుకు మోతిబిందు కంటి ఆపరేషన్ కోసం లైన్స్ కంటి ఆసుపత్రిని సంప్రదించి పరీక్షలు చేయించుకున్నాడు కోటగిరిలోని లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ ను ఆశ్రయించాడు గ్రామానికి చెందిన దస్తగిరి సహకారంతో కంటి ఆపరేషన్ కు లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ ముందుకు వచ్చింది యువకుని దీన పరిస్థితిని తెలుసుకొని ఆయన కంటి ఆపరేషన్ నిమిత్తం లెన్స్ తప్పనిసరి కావడంతో 25 వేల రూపాయల లెన్స్ ను వేయించేందుకు లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ సభ్యులు ముందుకు వచ్చారు . బుధవారం శస్త్ర చికిత్సలు చేయించి 25 వేల రూపాయల విలువ చేసే లెన్స్ ను వేయించడం జరిగింది. ఇందుకు సహకరించిన లైన్స్ కంటి ఆసుపత్రి ట్రస్ట్ నిర్వాహకులు బసవేశ్వరరావును లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ సభ్యులు అభినందించారు. కాంట్రాక్ట్ కంటి శస్త్ర చికిత్సకు అవసరమైన డబ్బులు లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ సభ్యులు సమకూర్చారు .ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ అధ్యక్షులు లయన్ తెల్ల రవికుమార్ ప్రధాన కార్యదర్శి లయన్ హనుమంతరావు పటేల్ కోశాధికారి లయన్ కప్ప సంతోష్ సభ్యులు పప్పుల యోగేష్ పెద్ద కాపు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు
