పంతం రవి, సిపిఐ నాయకులు.
తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల) సిరిసిల్ల పవర్ లూమ్ కార్మికుల సమస్యలు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై సిపిఐ నాయకులు పంతం రవి అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం కార్మిక భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో రవి మాట్లాడుతూ సిరిసిల్ల పర్యటనకు రానున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమస్యలపై సమాధానం చెప్పాలని లేని పక్షంలో అడ్డుకుంటామని అన్నారు. ఇప్పటికైనా కార్మికుల ఉపాధి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు
