మరిగమ్మ దేవి ఆలయానికి వెండి ఆభరణాలు బహుకరణ.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో మరిగమ్మ దేవి  ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ వార్షికోత్సవం పురస్కరించుకొని  మరిగమ్మ దేవి ఆలయంలోని విగ్రహానికి  వెండి ఆభరణాలను బర్ల మధుకర్ దంపతులు బహుకరించారు. ఆయనకు బాబు జగ్జీవన్ రామ్ యూత్ సభ్యులందరూ కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ వార్షికోత్సవం కార్యక్రమం సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ... మరిగమ్మ దేవి వారి కుటుంబానికి ఎల్లవేళలా సుఖసంతోషాలతో  ఆయురారోగ్యాలతో ఉంచాలని దీవించారు. వెండి ఆభరణాలు ఆలయానికి బహుకరించినందుకు  బర్ల మధుకర్  దంపతులకు ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బర్ల గంగారం బర్ల మధుకర్ దంపతులు బాబు జగ్జీవన్ రామ్ యూత్ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

.