సూరారం లోని నాలెడ్జ్ ఐకాన్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) సూరారం కాలనీలోని నాలెడ్జ్ ఐకాన్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు, చిన్ని కృష్ణుల వేషంలో గోపికల వేషంలో చిన్నారులు సందడి చేశారు.బుడిబుడి అడుగులతో కోలాటాలతో ఆటపాటలతో చిన్నారులు నృత్యాలు  సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు, విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సూరారం ఎస్సై శ్రీ వెంకటేశం పాల్గొని విద్యార్థులను అభినందించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్ ఎం వై రాజేష్ కుమార్ తెలిపారు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ ఎం అరుణ టీచర్స్  అభినందించారు.

.