తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మంజూరు చేయించిన 60,000/- రూపాయల విలువ గల "సీఎం సహాయ నిధి" చెక్కును నిజాంపేట్ లోని డిప్యూటీ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ తో కలిసి లబ్ధిదారుడు సత్తయ్య కు చెక్కును పంపిణీ చేశారు.ఈ సందర్బంగా లబ్ధిదారుడు సత్తయ్య ఎమ్మెల్యే కేపీ వివేకానందకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొర్రా చందు ముదిరాజ్ , నాయకులు సాంబాశివా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
