ఘనంగా మదర్ థెర్రిస్సా జయంతి వేడుకలు

నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్  హన్మంత్ రెడ్డి

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపుర్)  నిజాంపేట్  మున్సిపల్ కార్పొరేషన్ రాజీవ్ గృహ కల్పలో మదర్ థెర్రిస్సా 114 వ జయంతి వేడుకల్లో పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం మదర్ థెర్రిస్సా చారిటీ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరంలో పాల్గొన్నా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్ తెరిసా గొప్ప మానవతావాది ఎంతోమందికి సేవ చేసిన గొప్ప గుణవంతురాలు అని అన్నారు. ఆమె చేసిన సేవలు ఇప్పటికీ మర్చిపోలేని అలాంటి వ్యక్తి ఆశయాలను మనమందరము కొనసాగించాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

.