సెలెస్టియల్ స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.

తెలంగాణ ప్రభ, (సిరిసిల్ల) సిరిసిల్ల పట్టణంలోని అశోక్ నగర్ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ గోపికల వేషాధనలతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. ఉట్టి కొట్టి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో కరస్పాండెంట్ బుర్ర రాధాకృష్ణ ప్రసాద్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

.