తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల) సిరిసిల్ల పట్టణంలోని అశోక్ నగర్ వివేకానంద విద్యానికేతన్ హైస్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడి గోపికల వేషాదారులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కోలాటం సాంస్కృతిక ప్రదర్శనలతో పాఠశాలలో సందడి చేశారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ బుచ్చారావు, మహేందర్ రెడ్డి శ్రీనివాస్ రామచంద్రం విద్యార్థులు పాల్గొన్నారు.
