నేడే ఏఎంసీ చైర్మన్ బాధ్యతలు స్వీకరణ.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి ఉమ్మడి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ పదవి బాధ్యతలను స్వీకరిస్తున్నారని మార్కెట్ కమిటీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ పదవి బాధ్యతల స్వీకరణ సందర్భంగా చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు మాట్లాడుతూ.. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర అగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ నాపై నమ్మకంతో చైర్మన్ పదవి  అప్పజెప్పినందుకు వారి నమ్మకాన్ని ఏనాడు మర్చిపోలేనని పాత్రికేయులతో తెలిపారు. వారికి పదవి బాధ్యతల స్వీకరిస్తున్న శుభ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఉమ్మడి మండలంలోని స్థానిక ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ  ధన్యవాదాలు తెలిపారు.

.