వాలీబాల్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా శ్రీ కుమార్.

తెలంగాణ ప్రభ (సిరిసిల్ల) రాజన్న సిరిసిల్ల జిల్ల వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా చేన్నమనేని  శ్రీ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం రాజీవ్ నగర్ లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చేన్నమనేని శ్రీ కుమార్, ప్రధాన కార్యదర్శి గా రాందాస్, ఉపాధ్యక్షులుగా లక్ష్మీనారాయణ, ప్రసాద్ రావు, శ్యాం కుమార్ ,వేణు, మహేష్, ఎండి రఫీ, శ్రీనివాస్ తదితరులు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.

.