తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండల కేంద్రంలోని షాదీఖానా కార్యాలయంలో ఆకు ప్రెషర్ ,మ్యాగ్నెటిక్ వివిధ వ్యాధులకు సంబంధించిన చికిత్స శిబిరాన్ని పోతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల శంకర్ ప్రారంభించారు. ఈ శిబిరంలో చుట్టుపక్కల గ్రామాల వారు పలు వ్యాధులకు చికిత్స చేసుకోగలరని గంధపు రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్ మాజీ ఎంపీపీ గంధం పవన్ కేశ వీరేశం గట్ల విట్టల్ ధనరాజ్ మన్సూర్ గంధపు దత్తు శ్రీకాంత్ సంతు లైన్స్ క్లబ్ డైమండ్ సభ్యులు తెల్ల రవికుమార్ శ్రీపధ్ చెర్రీ తదితరులు పాల్గొన్నారు.
