ఘనంగా మరియమ్మ దేవి ప్రథమ ఆలయ మహోత్సవం.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో మరియమ్మ దేవాలయ ప్రథమ వార్షికోత్సవం  బాబు జగ్జీవన్ రామ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో దేవికి ప్రత్యేక పూజలు చేసి నూతన వస్త్రాలను సేకరించి  ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలోని మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ సంఘ సభ్యులు  స్థానిక ప్రజా ప్రతినిధులకు శాలువతో  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ సంఘ కమిటీ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

.