కులగనన చేసిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి.

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిది పర్ష హనుమండ్లు.

బిపి మండల్ 16వ జయంతి వేడులు. 

తెలంగాణ ప్రభ(సిరిసిల్ల) కుల గణన చేసిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమండ్లు డిమాండ్ చేశారు. ఆదివారం బీపీ మండల్ 106వ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల గణన చేసిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీర వేణి మల్లేష్ యాదవ్, తడుక కమలాకర్, కంచర్ల రవి గౌడ్, ప్రసాద్, కందుకూరి రామ గౌడ్, తిరుపతి శ్రీకాంత్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

.