ఏఎంసీ ప్రమాణ స్వీకారానికి పోచారం, కాసుల రాక.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి ఉమ్మడి మండల మార్కెట్ కమిటీ నూతన పాలక కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధులుగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షేట్కార్, వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్,మాజీ డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి హాజరైతున్నారని మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్  ఒక ప్రకటనలో పాత్రికేయులతో తెలిపారు. ఈ నూతన పాలక కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయా మండలాల మాజీ జెడ్పిటిసి, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు సహకార సంఘ అధ్యక్షులు ఉమ్మడి మండలాల గ్రామ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు హాజరుకావాలని ఆయన కోరారు.


.