బియ్యంకార్ శ్రీనివాస్, సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు.
తెలంగాణ ప్రభ (సిరిసిల్ల) సహకార విద్యుత్ సంస్థలు సక్రమంగా రీడింగ్ తీయకపోవడం వల్ల వినియోగదారులు నష్టపోతున్నారని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యం కార్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ 30 రోజులకు మించి తీయడం వల్ల విద్యుత్ వినియోగదారులు గృహలక్ష్మి పథకానికి అర్హులు కాకుండా పోతున్నారు అన్నారు. ఇలాగే 35 రోజులకు రీడింగ్ తీయడం వల్ల కుసుమ గణేష్ అనే వినియోగదారుడు 19 యూనిట్లు ఎక్కువ రావడం వల్ల గృహజ్యోతికి వర్తించకుండా పోయిందని సిజి ఆరిఫ్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. రీడింగ్ తీయడంలో వినియోగదారులు నష్టపోకుండా చూడాలని అధికారులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పౌర సంక్షేమ సమితి సహాయ కార్యదర్శి కుసుమ గణేష్, చిప్ప దేవదాస్, చీకోటి అనిల్, వేముల పోశెట్టి పాల్గొన్నారు.
