పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ ఏకైక పరిష్కారం.

తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల): పాత పెన్షన్ పునరుద్ధరణ ఏకైక పరిష్కారమని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్ అన్నారు. ఆదివారం జరిగిన టీఎస్ యుటిఎఫ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాల సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగులకు 50% పెన్షన్ గ్యారెంటీ చేస్తున్నట్లు, సర్వీసులు మరణించిన ఉద్యోగులకు 60 శాతం ఫ్యామిలీ పెన్షన్ ఇస్తామని ప్రకటించినప్పటికీ చెందాతో కూడిన పెన్షన్ పథకాన్ని రద్దు చేసే విషయాన్ని ప్రస్తావించకపోవడంలోనే మోసం ఉందని అన్నారు. సర్వీసు ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని శంకర్ డిమాండ్ చేశారు. సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

.