తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని శ్రీవేద హైస్కూల్లో శనివారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో అందరినీ అలరించారు. కృష్ణుడు గోపికలు ఉట్టి కొట్టే కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. పాఠశాల ఆవరణలో కృష్ణాష్టమి వేడుకలను విద్యార్థుల ఆటపాటల మధ్య ఘనంగా నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా కృష్ణాష్టమి వేడుకలు పాఠశాల ఆవరణలో కొనసాగాయి. గోపికల నడుమ శ్రీకృష్ణుడు వేషాధారణలో చిన్నారులు అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పాఠశాల డైరెక్టర్ తేల రవికుమార్ ప్రిన్సిపల్ తెల్ల అక్షర ఉపాధ్యాయ బృందం నిర్మల సాయి పవన్ సాయిరాం రేష్మ చంద్రకళ సంగీత సంధ్య షామిలి సంగీత నందిని ప్రవళిక అశ్విని తదితరులు పాల్గొన్నారు.
