ఓర్వలేకనే బిఆర్ఎస్ విమర్శలు.

కేకే మహేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్.

సిరిసిల్లలో పలు వార్డులలో జెండా ఆవిష్కరణలు

తెలంగాణ ప్రభ( సిరిసిల్ల ) ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణను చూసి బిఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణంలోని పలు వార్డులలో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉండి 10 ఏళ్లు ప్రజలకు ఏం చేశారని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను విమర్శించారు. ఇచ్చిన హామీల ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు పథకాల్లో ఐదు పథకాలు పూర్తి చేసిందని అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో బిఆర్ఎస్ విమర్శలు అర్థరహితమని తెలిపారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

.