బాధిత కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణ ప్రభ (సిరిసిల్ల). సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 34 వార్డు కు చెందిన కొండ భాను ఇటీవల మృతి చెందారు. శనివారం ఆయన కుటుంబ పరిస్థితులను గమనించిన స్థానిక కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ప్రభుత్వపరంగా కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా దార్ల కీర్తన సందీప్ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు పాల్గొన్నారు.

.