తెలంగాణ ప్రభ (సిరిసిల్ల) కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ సిరిసిల్ల పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షులుగా బండారి అశోక్ నియామకం అయ్యారు. శనివారం ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ జిల్లా అధ్యక్షులు గోనె ఏల్లప్ప ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత సెల్ పట్టణ అధ్యక్షులుగా నియామకం చేయడం పట్ల అశోక్ హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమలలో అన్ని వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తాను అని అశోక్ తెలిపారు.
