ఎస్పీ అఖిల్ మహాజన్.
తెలంగాణ ప్రభ(సిరిసిల్ల) శిక్షల పెంపుతోనే సమాజంలో మార్పు వస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శని వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ
కోర్టు కేసులలో శిక్షల శాతాన్ని పెంచడం, తప్పు చేసిన నిందితులకు శిక్ష పడేలా చేయడం ద్వారా ప్రజలకు పోలీస్ శాఖపై మరింత గౌరవం, నమ్మకం పెరుగుతుందన్నారు. కేసుల్లో శిక్షల అమలు, పెండింగ్ కేసుల పరిష్కారానికి సంబంధించిన అంశాలపై కోర్టు కానిస్టేబుళ్లను అడిగి తెలుసుకొని,కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులు, వారెంట్స్, సమన్స్ తదితర అంశాలు వాటి పురోగతిపై పలు సూచనలు చేశారు.
కోర్టు కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుండి కేసు పూర్తయ్యేంతవరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు,సాక్షుల ను కోర్టుకు సమర్పించడంలో కోర్టు డ్యూటీ అధికారులు కీలకంగా వ్యవహరించి నిందుతులను దోషులుగా నిరూపించి శిక్షలు పడేలా పని చేయాలన్నారు.
కోర్టు కేసుల్లో నిందుతులకు శిక్షలు పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, ఇందుకు అనుగుణంగా కేసులు పెండింగులో లేకుండా చూసుకోవాలని,కోర్టు సమాచారం ప్రాసిక్యూషన్ కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు తెలియజేయాలని, కేసు ట్రయల్స్ సమయములో PP ల యొక్క సలహాలు సూచనలు స్వీకరించాలని సూచించారు.
కోర్టు కేసులలో నిందుతులకు శిక్షలు పడేలా కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించారు.
శుక్రవారం రోజున గౌరవ కోర్టు వెల్లడించిన మూడు కేసులలో ఎనిమది మందికి శిక్షలు పడటంతో కృషి చేసిన కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, నరేష్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ మధుసూదన్, రైటర్స్ రాజేంద్రప్రసాద్, ప్రసాద్, రుద్రంగి ఎస్.ఐ అశోక్ లను అభినదించి, ప్రసంశ పత్రాలు, రివార్డు లు అందించారు. సమావేశం లో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.
.