ఏరియా ఆసుపత్రిలో రికార్డు స్థాయి ఆపరేషన్లు.
తెలంగాణ ప్రభ. (వేములవాడ) "నేను రాను బిడ్డో సర్కార్ దావఖానకు"అనే పరిస్థితి నుంచి సర్కారు దావఖానకే పోతామనెల పరిస్థితిని మార్చారు వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ సర్జన్ డాక్టర్ . పంతగాని పెంచలయ్య. రికార్డ్ స్థాయిలో ఆపరేషన్లు నిర్వహించి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపును వేములవాడ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 17 వివిధ రకాల ఆపరేషన్లు నిర్వహించారు. ఆరు డెలివరీలు,ఒకటి గర్భసంచిలో గడ్డ తొలగింపు, మూడు సాధారణ శాస్త్ర చికిత్సలు,ఆరు ఆర్తో ఆపరేషన్లు, రెండు కంటి ఆపరేషన్లు వీటిలో ఉన్నాయి. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ పంతగాని పెంచలయ్య మాట్లాడుతూ గైనకాలజిస్ట్ డాక్టర్ సంధ్య, ఆర్తో డాక్టర్ అనిల్, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ రాజశ్రీ ,డాక్టర్ తిరుపతి, కంటి వైద్యురాలు డాక్టర్ రత్నమాల సహకారంతో ఆపరేషన్లు పూర్తి చేసినట్లు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జూ సహకారం ఎంతో ఉందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో మరిన్ని వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రజలు వినియోగించుకోవాలని డిసి హెచ్ ఎస్ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ పంతగాని పెంచలయ్య విజ్ఞప్తి చేశారు.
