నేడు ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.

ప్రాణనాథ అచ్చుత దాస్ 

తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల)  శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ సిరిసిల్ల నిర్వాహకులు ప్రాణనాథ అచ్చుత దాస్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం అభిషేకంతో మొదలై పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాయంత్రం వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూజలలో పాల్గొనే వారు ఇస్కాన్ కేంద్రంలో సంప్రదించాలని అన్నారు. ప్రజలు వేడుకలలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సమావేశంలో  ఆడెపు శ్రీహరి .కోడం అశోక్. గాజుల రవి. సిరిసిల్ల తిరుపతి .తదితరులు పాల్గొన్నారు

.