వైభవంగా గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని వినాయక నగర్ కాలనీలో సంకట విమోచన గణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి వ్యవసాయ క్యాబినెట్ హోదా, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీవాసులు గణపతి ఆలయాన్ని నిర్మించడం చాలా అభినందనీయమని కొనియాడారు. గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనడం పూర్వజన్మసకృతమని అన్నారు .ఈ కార్యక్రమం సందర్భంగా కాలనీవాసులకు విగ్రహ ప్రతిష్టాపన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ అధ్యక్షుడు కూచి సిద్దు డిసిసి డెలిగేట్ కొట్ట మనోహర్ గైక్వాడ్ హనుమంత్, మండల అధ్యక్షులు షాహిద్ హుస్సేన్ మాజీ ఎంపీపీ పవన్, మాజీ జెడ్పిటిసి పుప్పాల శంకర్ ఆనంద్ బీర్పూర్ గంగాధర్ రేంజర్ల సాయిలు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

.