తెలంగాణ ప్రభ ( ఇల్లంతకుంట ): ఉద్యోగ రీత్యా బదిలీపై వెళ్తున్న మండలంలోని పొత్తూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి దొడ్ల లత శ్రీ కి రైతులు ,ప్రజా ప్రతినిధులు శుక్రవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు .పొత్తూర్ గ్రామ రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభకు మండల వ్యవసాయ అధికారి సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా బదిలీపై సిరిసిల్లకు వెళ్తున్న దొడ్ల లత శ్రీతో పాటు ఏవో సురేష్ రెడ్డి ని రైతులు శాలువాతో సత్కరించారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల క్రితం ఉద్యోగములో చేరి మొదటగా పొత్తూర్ క్లస్టర్ కు ఎంపిక కావడం నా అదృష్టమన్నారు .ఏడు సంవత్సరాలు క్లస్టర్ గ్రామాల్లోరైతులకు సేవ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఆమె భవోద్వేగానీకి గురి అయ్యారు . ఎల్ల వేళలా అందుబాటులో ఉండి సేవలందించిన అధికారి అని రైతులు కొనియాడారు .ఇలాంటి అధికారిని కోల్పోవడం బాధాకరమని రైతులు పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో క్లస్టర్ గ్రామాల రైతులు ,ప్రతినిధులు పాల్గొన్నారు .
