తెలంగాణ ప్రభ (సిరిసిల్ల) తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణాన్ని మాఫీ చేసిందని రుణమాఫీకి వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేయడంపై కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమావేశంలో పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరుతున్న తరుణంలో టిఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. రైతాంగానికి వాస్తవాలు తెలుసని ఇప్పటికైనా బిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలి అన్నారు. సమావేశంలో పీసీసీ సభ్యులు నాగుల సత్యనారాయణ గౌడ్, జిల్లా కార్యదర్శి వైద్య శివప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యన శివప్రసాద్, శ్రీకాంత్, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
