విద్యార్థినుల భద్రతకు అధిక ప్రాధాన్యం.

ఎస్పీ అఖిల్ మహాజన్.

పొక్సో యాక్ట్ ,గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన కార్యక్రమాలు.

తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల) విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పి అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణం వెంకంపెట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన "పొక్సో పై చైతన్యం" అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిధిగా హాజరై బాల బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ,ఫోక్సో చట్టం గురించి,పోక్సో చట్టం ప్రకారం అమలులో ఉన్న శిక్షల గురించి,సోషల్ మీడియా,సైబర్ క్రైమ్ ల వలన కలుగే అనర్ధాలపై అవగాహన కల్పించారు.జిల్లా పోలీస్ శాఖ విద్యార్థినుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని,విద్యార్థులు జీవితంలో చక్కటి లక్ష్యాలను ఎన్నుకుని సరైన మార్గంలో శ్రమిస్తూ ఉన్నత శిఖరాలను చేరుకోలే తప్ప అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నరు.

జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పొక్సో యాక్ట్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై అవగాహన పరచడానికి "పొక్సో పై చైతన్యం" పేరుతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

మైనర్ బాలికలు, చిన్నారుల పట్ల నేరాలకు పాల్పడే వారికి పోక్సో చట్టం ప్రకారం జీవిత ఖైదు వంటి కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని,తద్వారా తమ విలువైన జీవితం అంతా జైల్లోనే మగ్గిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

చిన్నారుల పట్ల నేరాలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని హెచ్చరించారు.మహిళలను గౌరవించడం, వారికి అండగా నిలబడడం వంటివి అలవర్చుకోవాలని సూచించారు. 

చిన్నారులు తమకు ఇంట్లో,పాఠశాలలో,వీధుల్లో పొరుగువారితో ఎదురయ్యే రకరకాల వేధింపులు, అసభ్య ప్రవర్తన,గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ల గురించి నిర్భయంగా తమ తల్లిదండ్రులకు తెలియజేయాలని,తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.

విద్యార్థినిలు మహిళలు మౌనం విడి ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని,నిర్భయంగా ముందుకు వచ్చి మీ సమస్యలను చెప్పుకున్నాప్పుడే మరింత భద్రత కల్పించగలువుతామని,మహిళలు,విద్యార్థినిలు జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425  కు పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు.పిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సిరిసిల్ల టౌన్ సి.ఐ కృష్ణ,జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజాం,సిడబ్ల్యుసి చైర్పర్సన్ అంజయ్య,షీ టీం ఏ. ఏ. ఎస్.ఐ ప్రమీల, షీ టీం సిబ్బంది రమాదేవి, ప్రియాంక,మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా ఐసిపిఎస్ సిబ్బంది సఖి సిబ్బంది,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

.