తెలంగాణ ప్రభ (సిరిసిల్ల) సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 34 వార్డులో శుక్రవారం స్థానిక కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ ఆధ్వర్యంలో డ్రైడే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీవాసులకు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న పరిస్థితులు జాగ్రత్త ఉండాల్సిందిగా కోరారు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతి వారంలో రెండు రోజుల చొప్పున వార్డులు డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్పిలు మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు పాల్గొన్నారు.
