తెలంగాణ ప్రభ (సిరిసిల్ల). సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తల్లిదండ్రులు ప్రత్యక్ష దేవుళ్ళు అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రథమ బహుమతి కిరణ్మయి, ద్వితీయ బహుమతి హర్షిత నైన్త్, తృతీయ బహుమతి ఎండి అప్సర బేగం, తో పాటు పలు విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి శుక్రవారం రోజున సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నాయకులు చేపూరి బుచ్చయ్య. జనపాల శంకరయ్య, శివనగర్ పాఠశాల హెచ్ఎం మోతిలాల్, వెంకంపేట జడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
