సంక్షేమ వసతి గృహం సందర్శన.

తెలంగాణ ప్రభ(సిరిసిల్ల) భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం సాంఘిక సంక్షేమ వసతి గృహాలను సందర్శించారు. సిరిసిల్లలోని బీసీ వెల్ఫేర్ వసతి గృహంలో విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సరైన మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై ముందుండి పోరాడతామని అన్నారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ వి నాయకులు శ్రీనివాస్, వెంకటేష్, నవీన్, తిరుపతి, సాయి, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

.