తెలంగాణ ప్రభ (సిరిసిల్ల) లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో శుక్రవారం ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ సిరిసిల్ల ప్రెసిడెంట్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ భానుచందర్ విద్యార్థినులకు కంటి పరీక్షలు నిర్వహించారు. తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. వెంకటేశ్వర ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి వనజ కుమారి, అధ్యాపకులు మురళి, సీతారామన్, నవీన్ రెడ్డి, ప్రవీణ్, శ్రీనివాస్, గంగరాజు, సునీత, అనిత తదితరులు పాల్గొన్నారు.
