తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల). సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుజ్జె నవీన్ కుమార్ బెస్ట్ ఫోటోగ్రాఫర్ గా అవార్డు అందుకున్నారు.ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఆగస్టు 19న నిజామాబాద్ జిల్లాకు చెందిన జి ఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో నవీన్ కుమార్ బెస్ట్ ఫోటోగ్రాఫర్ గా ఎన్నికయ్యారు.ఈనెల 22,గురువారం నిజామాబాద్ పట్టణంలోని సాయిబాబా మందిరంలో జరిగిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు చేతుల మీదుగా బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డును నవీన్ కుమార్ కు ప్రధానం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రేవతి ఫోటో స్టూడియో నిర్వహిస్తున్న గుజ్జే నవీన్ కుమార్ ఇప్పటికే పలు జాతీయ,అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. గత 25 సంవత్సరాలుగా ఫోటోగ్రఫీ రంగంలో కొనసాగుతూ వెడ్డింగ్, పిక్టోరియల్, కాండీడ్,వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో తన ప్రతిభను చాటుకున్న నవీన్ కుమార్ పలు సంస్థల నుండి సన్మానాలు,సత్కారాలు అందుకున్నారు. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ మ్యాగజైన్లలో నవీన్ కుమార్ తీసిన ఫోటోలు ప్రచురితమయ్యాయి. గురువారం జరిగిన అవార్డు ప్రధాన కార్యక్రమంలో జి ఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు నరేష్ బాబు ఎన్ .పీ.డి.సీ.ఎల్ ఎస్.ఇ. ఆర్.రవీందర్, ఎన్ .పీ.డీ.సీ.ఎల్ .డి.ఇ.డి.పి.ఇ. ఎం ప్రభాకర్ రావు,నిజామాబాద్ తాసిల్దార్ ఎస్ నాగార్జున తోపాటు ఫోటోగ్రాఫర్లు హాజరయ్యారు. బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు అందుకున్న నవీన్ కుమార్ ను సిరిసిల్ల జిల్లా ఫోటోగ్రాఫర్స్ సంఘం అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రకాష్,
శ్రీపతి రమేష్ ,మెరుగు సంతోష్ అడ్డగట్ల ప్రశాంత్, బంక శంకర్ పలువురు మిత్రులు అభినందించారు.
.