వెంకటరామిరెడ్డి జయంతి వేడుకలు.

తెలంగాణ ప్రభ (సిరిసిల్ల) రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి జయంతి వేడుకలను గురువారం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా కమిటీ అధ్యక్షులు అంజిరెడ్డి తో పాటు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి మాట్లాడుతూ వెంకటరామిరెడ్డి అందించిన సేవలను కొనియాడారు. ఉత్తమ విద్యార్థులకు ఈ సందర్భంగా పారితోషకాలు అందించారు. వెంకటరామిరెడ్డి స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని అంజిరెడ్డి కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దూరు రామిరెడ్డి, మాజీ జిల్లా కోర్ కమిటీ సభ్యులు రామలింగారెడ్డి, పాతూరు మహేందర్ రెడ్డి, బాణాపురం రంగారెడ్డి, పొన్నాల బాల్ రెడ్డి, పలు నాయకులు పాల్గొన్నారు.

.